భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు .

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు ?

భారత్‌లో ఇప్పటికి వరకు పాత కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ ఉందనుకుంటే కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం నెమ్మదిగా పెరుగుతుంది. దేశంలో మొత్తం కొత్త కరోనా కేసుల సంఖ్య వంద దాటింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా కేసులు నమోదు కాగా, 228 మంది కరోనాతో మరణించారు.

ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,31,639కి చేరింది. ప్రస్తుతం అందులో 2,24,190 యాక్టివ్ కేసులు ఉండగా, 1,00,56,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,50,798 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 19,253 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.04 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.