మహేశ్​ను ఫాలో అవుతున్న బిల్​గేట్స్​..

సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌‌కు అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ మహేశ్​, నమ్రత దంపతులు ప్రపంచ కుబేరుడు బిల్​గేట్స్​ను కలిశారు. ఈ ఫొటోలను మహేశ్ ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. వైరల్​ అయ్యింది. అయితే మహేశ్​ చేసిన ట్వీట్​కు బిల్​గేట్స్​ స్పందించారు. రీట్వీట్​ చేశారు. అయితే బిల్​గేట్స్​ అంతటితో ఆగకుండా.. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో మహేశ్​ బాబును ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మహేశ్​బాబు కూడా బిల్​గేట్స్​ ట్విట్టర్​ను​ ఫాలో అవుతున్న నేపథ్యంలో.. ఇది కూడా వైరల్​గా మారింది.