రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై డైరెక్టర్ శంకర్ అందించిన అప్ డేట్ ?

మెగాపవర్ స్టార్ “గేమ్ ఛేంజర్ ” ఆర్ఆర్ఆర్ తరువాత రాంచరణ్ ది వస్తున్న మూవీ కావడంతో దీనిపై చరణ్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో చరణ్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు . ఇంకా ఈ మూవీ లో శ్రీకాంత్, సునీల్, అంజలి, తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతం అందించారు .శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా ఒక అప్ డేట్ అందించారు దర్శకుడు శంకర్. నేటితో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ మొత్తం పూర్తి అయిందని అనడంతో గేమ్ ఛేంజర్ టీజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా అతి త్వరలో గేమ్ ఛేంజర్ మూవీ గురించి మరిన్ని వివరాలు రానున్నట్లు తెలుస్తోంది.