రిలీజ్ కి బ్రేక్ పడ్డ రవితేజ న్యూ మూవీ

రిలీజ్ కి బ్రేక్ పడ్డ రవితేజ న్యూ మూవీ

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రస్తుతం క్రాక్ మూవీ లో నటిస్తిన్న విషయం మన అందరికి తెలుసు. అయితే ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సిన ‘క్రాక్’ మూవీ మార్నింగ్ 8:45 షో క్యాన్సల్ అయింది. నిర్మాత ఠాగూర్ మధు సినిమా పనిలో చెన్నైలో ఉండటం వల్ల.. మార్నింగ్ షో విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో షో క్యాన్సల్ అయింది. అయితే పది గంటల షో పడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన లాస్ట్ సినిమా డిస్కో రాజా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజకి ఈ మూవీ కీలకం కానుంది.

చాల మంది ఫాన్స్ థియేటర్ కి వెళ్లి మూవీ చూద్దాం అని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు తీరా థియేటర్ కి వెళ్తే ‘ షో రద్దు చేసాం ‘ అనే కబుర్లు చెప్పటం తో చాలా రోజులు తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూద్దాం అనుకున్న ఫాన్స్ నిరూస్స్హా పడ్డారు