విష్ణు గారు, మీ వ్యాఖ్యలకి ఏమైనా అర్ధం ఉందా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్న మొన్నటిదాకా కలిసే ఉన్న టీడీపీ-బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా పాటిస్తూ వచ్చిన మిత్రధర్మం ఒక్కసారిగా మటుమాయం అయ్యింది. నిధులు ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు బీజేపీ నాయకుల మీద విమర్శలు చేస్తుంటే ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పలేదు, అలాగే ఆ నిధులని పక్కదోవ పట్టించారు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అర్ధవంతమైన ఆరోపణలు చేస్తే బాగానే ఉంటుంది కానీ, బీజీపీ నాయకులు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు రాజకీయ జ్ఞానం ఉన్న వారికే కాదు అసలేమీ రాజకీయ పరిజ్ఞానం వారికి కూడా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి దానికి ఉదాహరణే నిన్న పార్లమెంట్ వద్ద మెట్లకి నమస్కరించిన చంద్రబాబు మీద బీజీపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు.

గతంలో ఎప్పుడూ లేనంత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ మీదా కేంద్రం మీదా ఫైర్ అవుతున్న తరుణంలో ఆయన మీద విమర్శలు చేసేందుకు వీలుగా ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు కాషాయ నాధులు. తాజాగా ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీకి వెళ్లి పలువురు పార్టీ నేతలతో భేటీ అవుతున్న చంద్రబాబు పార్లమెంటు మెట్ల దగ్గర మొక్కటం తెలిసిందే.

పార్లమెంటు మీద భక్తి ఉండాలే కానీ.. మెట్లను మొక్కితే మీడియాలో ప్రముఖంగా పడతామన్నట్లుగా బాబు తీరు ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బాబు మెట్లకి మొక్కడం మీద సోషల్ మీడియా లో వైరల్ అయిన వేళలో.. విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు దొందూ దొందే అన్నట్లుగా ఉంది. ఎందుకయ్యా అంటే..విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యల ప్రకారం పార్లమెంటు మెట్లకుమొక్కితే ప్రధానికి మొక్కినట్లేనని, కాని అదెలా సాధ్యం అసలు మెట్లకి మొక్కితే మనిషికి మొక్కినట్టు ఎలా అన్వయిస్తాం, పోనీ అలానే అన్వయిద్దాం అనుకుందాం పార్లమెంట్ లో మోడీ కేవలం సభా పక్ష నాయకుడు మాత్రమే, ఒక వేళ అటువంటి అవకాశం ఏమయినా ఉంటె అది లోక్ సభ స్పీకర్ మీదకి పోతుంది కదా.

అల ఎలా చూసుకున్నా గానీ విష్ణుకుమార్ రాజు ర్ర్ విధంగా వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం స్వాగతించలేని రీతిలో ఉంది. ప్రధాని స్థానంలో ఉన్న మోడీ సైతం పార్లమెంటుకు బాధ్యుడే కానీ.. పార్లమెంటుకు అతీతుడు కాదన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా ? సదరు ఎమ్మెల్యే గారి స్వామి భక్తి చూస్తోంటే ఆయనింకా రాజుల కాలంలో ఉండి, రాముడి పాదుకలు సింహాసనం మీద ఉంచి పాలన చేయించినట్టు అలోచిస్తునారేమో ?

ఇప్పటి దాకా ఆంధ్రా రాజకీయాల్లో విష్ణు కుమార్ రాజు కి కాస్త జెంటిల్ మాన్ ఇమేజ్ ఉండేది, కాని ఇలా తలా తోకా లేని వ్యాఖ్యలు చేసి ఆయనే తన ఇమేజ్ ని చేరిపెసుకుంటున్నారు. చూద్దాం ఎన్నికలు అయ్యే లోపు ఇంకెన్ని వింత వింత వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో.