వైవా హర్ష నిశ్చితార్ధ వేడుకకి హాజరైన మెగా ఫామిలీ హీరో

వైవా హర్ష నిశ్చితార్ధ వేడుకకి హాజరైన మెగా ఫామిలీ హీరో

కరోనా టైం లోనే సినీ ఇండస్ట్రీ లో చాల మంది వివాహాలు జరిగాయి . మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ వివాహాలు జరుగుతున్నాయి . నిన్నే సింగర్ సునీతా వివాహం జరిగింది కదా మరి ఇప్పుడు ఎవరిదీ అనుకుంటున్నారా అదే నండి యూట్యూబ్ స్టార్‌గా ఫేమస్ అయి సినిమాల్లో కూడా ఛాన్స్ పట్టేసిన వైవా హర్ష కి నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది.

ఈ మేరకు తన నిశ్చితార్ధ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది. కేవలం కొద్దిమంది మిత్రులతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని నిరూపించిన వారిలో వైవా హర్ష ఒకరు. కేవలం యూ ట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్‌లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. పలు సినిమా అవకాశాలు అందుకున్నాడు . రీసెంట్‌గా వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.