సీక్వెల్ కి రెడీ అంటున్న … నిఖిల్

సీక్వెల్ కి రెడీ అంటున్న ... నిఖిల్

నిఖిల్ హీరోగా సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2014 అక్టోబర్ 24న ‘కార్తికేయ’ అనే సినిమా విడుదలైంది. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
యానిమ‌ల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ‘కార్తికేయ’ చిత్రం ద్వారా డైరెక్టర్ చందు మొండేటి తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేశారు. మొత్తానికి మళ్లీ వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘కార్తికేయ 2’ వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవేంక‌టేశ్వరుని స‌న్నిధానంలో ప్రారంభించనున్నారు.
‘‘అర్జున్ సుర‌వ‌రం’’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌రువాత ఏ చిత్రం చేయ‌కుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల‌కి, త‌న అభిమానుల‌కి కిక్ ఇచ్చే చిత్రం చేయాల‌ని నిఖిల్ ‘కార్తికేయ‌ 2’కి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఊహకు అందని మరో కొత్త కథలో చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ‘కార్తికేయ 2’కు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ 2020 చివరిలో సినిమాను విడుదల చేస్తారట. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు.