సుధీర్‌తో మ్యారేజ్ విషయమై తన నిర్ణయాన్ని చెప్పిన రష్మీ

సుధీర్‌తో మ్యారేజ్ విషయమై తన నిర్ణయాన్ని చెప్పిన రష్మీ

యాంకర్ రష్మీ గౌతమ్- సుడిగాలి సుధీర్.. అని వింటే చాలు ఫాన్స్ ఈ జోడీ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. జబర్దస్త్ వేదికపై కలిసిన ఈ జంట బుల్లితెర పాపులర్ జోడీగా తెగ హంగామా చేస్తోంది. ఏ పండగ వచ్చినా, ఏ ఈవెంట్ జరిగినా ఈ ఇద్దరిపై షూట్ చేసిన సాంగ్స్, ఫన్నీ సన్నివేశాలు వైరల్ అవుతాయి . . ఇక వీళ్ళ మధ్య ఎఫైర్, పెళ్లికి సంబంధించిన విషయాలైతే నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడోచోట తారసపడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్‌తో మ్యారేజ్ విషయమై యాంకర్ రష్మీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రొగ్రమ్స్ వీళ్లిద్దరి రిలేషన్ మీద ఓ రేంజ్ జోకులేస్తూ జబర్దస్త్‌ వినోదం పంచుకుతుంటారు కొందరైతే ఏకంగా రష్మీ- సుధీర్ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నొమ్మోదంటూ చాలా సార్లు ఈ విషయమై స్పందించిన రష్మీ.. తాజాగా కాస్త ఆసక్తికరంగా మాట్లాడటంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మీ ఓ కార్యక్రమానికి హాజరుకాగా ఎప్పటిలాగే సుధీర్‌తో పెళ్లి గురించి అడిగేశారు. దీనిపై రియాక్ట్ అయిన రష్మీ.. ‘మా ఇద్దరి పెళ్లి జరగాలని జనాలు కోరుకుంటున్నారని నాకూ తెలుసు కానీ ప్రస్తుతం నా ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ కెరీర్‌పై మాత్రమే ఉన్నాయి’ అని చెప్పింది రష్మీ.

.దాంతో పాటుగా మీ ఇద్ద‌రి కాంబోలో సినిమాను చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక ఈ ఏడాదైనా తీరేనా? అని ర‌ష్మిని ప్ర‌శ్నించ‌గా.. అన్నీ కుదిరితే జ‌ర‌గొచ్చు అని ఆమె తెలిపారు. నేను, సుధీర్ కూడా స్క్రిప్ట్‌లు వింటున్నాము. స్క్రిప్ట్ న‌చ్చితే క‌చ్చితంగా న‌టిస్తాము అని ర‌ష్మి చెప్పుకొచ్చింది.