స్టార్ హీరో ఇంట్లో కరోనా టెస్టులు .

స్టార్ హీరో ఇంట్లో కరోనా టెస్టులు .

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంలోనూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి వ్యాధి బారిన పడ్డ వారిని గుర్తిస్తున్నారు. ఇందుకోసం విదేశాలకు వెళ్లొచ్చిన వారి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు.

ఇయితే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ఇంట్లో సోమవారం ఆకస్మాత్తుగా ఆరోగ్య శాఖ అధికారులు కరోనా తనిఖీలు చేయడం తమిళనాట కలకలం రేపింది.

స్టార్ హీరో విజయ్ కూడా సినిమా షూటింగ్ ల పేర విదేశాలకు వెళ్లడం తో చెన్నైలోని ఆయన నివాసాన్ని అధికారులు తనిఖీ చేశారు. వైద్యుల బృందం విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారణ కావడం తో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం శానిటైజర్స్ స్ప్రే చేసి వచ్చారు. ఈ వార్త తమిళనాట వైరల్ గా మారింది.