హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఇంట్లో నాలుగు రోజులుగా మృతదేహం..

ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

తెలంగాణలోని హైదరాబాద్ నడిబొడ్డులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. నగరంలోని దోమలగూడ వీధి నం.10 గగన్‌విహార్‌ ఫ్లాట్‌ నంబర్‌ 9లో నవీన్‌కుమార్‌  నివాసముండేవాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం అతను నివసించే ఫ్లోర్‌లో దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన పక్కింటి కుమార్‌ పాయల్‌ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా నవీన్‌కుమార్‌ సోదరుడైన నితీశ్ కు కూడా సమాచారం అందించాడు. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా.. నవీన్‌కుమార్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలోపడి ఉంది.

కాగా నవీన్‌ నాలుగు రోజులు కిందట మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దోమలగూడ ఇన్స్పె క్టర్‌ ఎస్సై ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే అతను ఎలా మరణించారు. ఏం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేకా ఏదైనా సమస్యనా అనే విషయాలపై సుదీర్ఘంగా పోలుసుల దర్యాప్తులో తేలనుంది.