హైపర్​ ఆదిని అరెస్ట్​ చేసిన పోలీసులు!….

ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆద్యంతం కామెడీ, డ్యాన్స్​లతో సాఫీగా సాగిపోతుండగా.. షో మధ్యలో సడెన్​గా పోలీసులు సీరియస్​ ఎంట్రీ ఇచ్చి ఫైర్​ అయ్యారు.

షూటింగ్​కు వచ్చే ముందు ఆది కారుతో యాక్సిడెంట్​ చేసి వచ్చాడని, బాధితుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పారు. దీంతో సెట్​లోని వారంతా షాక్​ అయ్యారు. పోలీసులతో ఆటో రామ్​ ప్రసాద్​, మిగతా వాళ్లు మాట్లాడటానికి ట్రై చేస్తున్నా.. అధికారులు వినకుండా కెమెరా ఆపాలంటూ ఫైర్​ అయ్యారు.

అయితే ఇదంతా ప్రమోషన్స్​ కోసమేనని ఇలా చెయ్యడం కొత్తేమి కాదు ప్రేక్షకులని ఆకట్టుకోడానికే ఇవన్నీ అని నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు