డ్రోన్ వివాదం…గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

Drone controversy ... TDP leaders complaining to the governor controversyˈkäntrəˌvərsē Translations of controversy Frequency వివాదాస్పదం controversy దీర్ఘకాల వైరుధ్యం controversy Definitions of controversy Noun 1 disagreement, typically when prolonged, public, and heated. he sometimes caused controversy because of his forceful views Synonyms: disagreement dispute argument debate dissension contention disputation altercation wrangle wrangling quarrel quarreling war of words storm cause célèbre hot potato minefield shitstorm Examples of controversy Scholars come and go and its attribution is a constant source of controversy . 23 more examples Synonyms of controversy Noun disagreement dispute argument debate dissension contention disputation altercation wrangle wrangling quarrel quarreling war of words storm cause célèbre hot potato minefield shitstorm tilt arguing contestation contention disceptation disputation argument

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ఎగరవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఫైర్‌ అయ్యారు ఏపీ టీడీపీ నేతలు. రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన వారు ఈ విషయం మీద ఫిర్యాదు చేశారు.

బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ విఫలం అయ్యిందని ఏపీ టీడీపీ నేతలు అన్నారు. కృష్ణానదికి వరదలు వస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడలేదని, ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో మనకు వరదలు వచ్చాయని అయినా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నారని ప్రకాశం బ్యారేజీలో 40 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని మాట్లాడే ఆ మంత్రిని ఏమనాలని ఫైర్‌ అయ్యారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఎక్కడ వరదలు తుఫాన్లు వచ్చినా చంద్రబాబు పని చేసిన విధానాన్ని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు.