కొరటాల జెట్‌ స్పీడ్‌ మీదున్నాడుగా..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస విజయాలతో దూసుకు పోతూ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పటి వరకు ఈయన చేసిన అన్ని సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు దక్కించుకున్నాయి. అలాగని ఈయన సినిమాలను సంవత్సరాల కొద్ది తీయడు. మొదలు పెట్టాడు అంటే అయిదు నుండి ఏడు నెలల్లో పూర్తి అవ్వాల్సిందే. భారీ బడ్జెట్‌లు లేకుండా సింపుల్‌గా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని మహేష్‌బాబు చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. సినిమా ప్రారంభంకు ముందే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తానని ప్రకటించిన కొరటాల ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. 

వచ్చే నెలలో మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ‘స్పైడర్‌’ చిత్రం రెండవ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు ‘భరత్‌ అను నేను’ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయాలనే నిర్ణయానికి కొరటాల వచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. అదే లుక్‌ను కొరటాల సిద్దం చేయిస్తున్నాడు. మహేష్‌బాబు పుట్టిన రోజు ఆయన ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాఖా అన్నట్లు. స్పైడర్‌ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, సంక్రాంతికి మహేష్‌ను కొరటాల శివ తీసుకు రాబోతున్నాడు. ‘శ్రీమంతుడు’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను సాధించిన విషయం తెల్సిందే. దాంతో మరోసారి వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలను కొరటాల అందుకోగలడనే నమ్మకం మహేష్‌బాబు ఫ్యాన్స్‌లో ఉంది.

మరిన్ని వార్తలు

ఛార్మి, ముమైత్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు

దొంగల పారిపోయిన నవదీప్‌!!

ఎన్టీఆర్‌ ‘సమ సమాజ్‌ పార్టీ’..?