రోడ్డుపై బట్టలు విప్పేసిన శ్రీ రెడ్డి… వైరల్ వీడియో

Sri Reddy Protest Nude On Road At Film Chamber

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తనని చాలా మంది సినీప్రముఖులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని వెబ్, ఎలక్ట్రానిక్ మీడియా ముందు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయకపోతే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలియజేస్తా అని ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో ప్రకటించిన శ్రీరెడ్డి అన్నంత పని చేసేసింది. ఈరోజు హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేసింది. ముందుగా చుడీదార్ ధరించి వచ్చిన ఆమె వస్త్రాలను పూర్తిగా తొలగించి..పొట్టి బట్టలతో తన నిరసన తెలిపింది. తర్వాత టాప్ తీసేసి.. కేవలం షార్ట్ తో రోడ్డుపై అందరూ చూస్తుండగా కూర్చుని ఒక టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. అప్పటికే మరి కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొన్నారు. మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదు. తనకు అన్యాయం చేస్తున్నారు. తన ఆవేదనను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ చర్యకు పూనుకొన్నాను అని శ్రీరెడ్డి మీడియాకు వివరించింది. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ వద్దనే ఉన్నారు. ఏదో ఆవేశంలో ఆమె ఇలా మాట్లాడి ఉంటుంది లే భావించిన అందరికీ షాక్ ఇస్తూ ఆమె ఈ చర్యకి పూనుకున్నారు. ఇప్పటి కయినా సినీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పరిష్కారం చూపకపోతే పరిస్తితి చేయిదాటే ప్రమాదం ఉంది.