క్రికెట‌ర్‌తో ల‌వ్‌లో ప్రియాంక జ‌వాల్క‌ర్ …

టాక్సీవాలా (Taxiwala), ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం (SR Kalyana Mandapam), తిమ్మ‌రుసు చిత్రాల్లో ప్రియాంక జ‌వాల్క‌ర్ ఆమెకు సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఓ అబ్బాయితో ప్రియాంక జ‌వాల్క‌ర్ (priyanka Jawalkar) మాట్లాడుతూ క‌నిపించింది. ఆ అబ్బాయి ఎవ‌రో కాదు.. ఇండియ‌న్ క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్యర్ అని.. మ‌రో క్రికెట‌ర్‌, సినీ స్టార్ మ‌ధ్య ప్రేమాయ‌ణం కొన‌సాగుతుందంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌టం ప్రారంభ‌మ‌య్యాయి.

దీనికి తోడు ఇప్పుడున్న యంగ్ క్రికెటర్స్ ప్రముఖమైన కె.ఎల్.రాహుల్..బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నారు. అదే దారిలో వెంకటేష్ అయ్యర్ కూడా హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడంటూ వార్తలు బలంగాచక్కర్లు కొట్టాయి.ఎట్ట‌కేల‌కు ఈ రూమ‌ర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి ప్రియాంక జ‌వాల్క‌ర్ రంగంలోకి దిగింది. సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ ‘‘ఫొటోలోని అబ్బాయి ఫొటో సెషన్ పనుల్లో మాకు సహాయం చేయటానికి వచ్చాడు.బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు రావటంపై అమ్మ అడుగుతోంది. ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బావుంటుంది’’ అంటూ పుకార్లకు చెక్ పెట్టేసింది ప్రియాంక జవాల్కర్