రెబ‌ల్‌ బ్యూటీ దీక్షా సేథ్… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

దీక్షా సేథ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా
దీక్షా సేథ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా

దీక్షా సేథ్.. ఈ అందాల భామ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ఢిల్లీ నగరం లో జ‌న్మించిన ఈ అమ్మాయి.. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించింది. 2010లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తీసిన `వేదం` మూవీతో సినీ రంగం లో అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `మిరపకాయ` సినిమాలో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ఈ అమ్ముడు స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్ద‌రూ `రెబల్‌` సినిమాలో న‌టించారు. ఈ సినిమా హిట్ అవ్వ‌క‌పోయినా.. దీక్షా సేథ్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత నిపు, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. కానీ, అవేమి దీక్షా సేథ్ కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ లేదు.

త‌మిళ్, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అయితే ఎక్క‌డా ఈ అమ్మ‌డు హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నా.. దీక్షా సేథ్ న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో ఆమెపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేసి ఇంటికి పరిమితం చేసారు.

దీక్షా సేథ్ చివ‌రిగా 2016 లో `సాత్ కదమ్` అనే హిందీ సినిమాలో నటించింది. ఆ త‌ర్వాత వెండితెరకు పూర్తిగా దూర‌మైంది.అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియో లు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.

ఎందుకే ఈ బ్యూటీ గుర్తుప‌ట్టలేనంత‌గా మారిపోయింది. షేప్ అవుట్ కాక‌పోయినా.. ఆమె ముఖంలో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇక‌పోతే ప్ర‌స్తుతం దీక్షా త‌న తండ్రితో క‌లిసి బిసినెస్ లో బిజీగా ఉంటుందని సమాచారం.