గల్లంతైన మత్స్యకారులు కుటుంబ సభ్యులు ఆందోళన..సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌..

గల్లంతైన మత్స్యకారులు

చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలంలో చోటు చేసుకోంది. వివరాల ప్రకారం. నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్‌ పాడైనట్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ వారు ప్రాణాలతో ఉన్నారో.లేరో తెలియక గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఆ నలుగురు క్యాంబెల్‌పేటకి చెందిన వారుగా అధికారులు తెలిపారు. మరో బోటులో క్యాంబెల్ పేట మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.