మహేష్ బాబు కోసం మళ్ళీ విలన్ గా రానున్న ఉపేంద్ర ..

మహేష్ బాబు కోసం మళ్ళీ విలన్ గా రానున్న ఉపేంద్ర ..

కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రెతి ఒక్కరు దొరికిన విరామాన్ని ఇంటిలో తమ ఫ్యామిలీతో గడుపుతున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు కుడా దొరికిన విరామాన్ని ఇంటిలో తన పిల్లలతో గడుపుతూ, ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు.తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఐతే ఆయన గీత గోవిందం దర్శకుడు పరుశురాంకే ఫిక్సయ్యారని తెలుస్తుంది. కొద్దిరోజులలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఈ చిత్రం గురించిన మరో ఆసక్తి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఉపేంద్ర బెటర్ ఛాయిస్ గా దర్శకుడు భావిస్తున్నాడట.
తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర స్ట్రెయిట్ మూవీస్ కూడా చేశారు. ఈయన 2015లో త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ రోల్ చేయడం జరిగింది. ఈమధ్య కాలంలో తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ ఇదే. సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.