మూవీ టైటిల్ ని ఆ టైం లో నే తెలుపుతాము అన్న తారక్

ఆ మూవీ టైటిల్ ని ఆ టైం లో నే తెలుపుతాము అన్న తారక్

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్మ తోనూ మరియు కన్నడ పవర్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో పవర్ ఫుల్ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ నటించనున్నారు.
.
అయితే ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ మాత్రం అంతంతమాత్రంగానే వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించి మాత్రం లేటెస్ట్ టాక్ వినిపించింది. టైటిల్ మరియు ఇతర అంశాలను షూటింగ్ మొదలు పెట్టే ముందే తెలుపుతామని అన్నారు. అయితే ఇది చూస్తుంటే మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” లానే అనిపించొచ్చు. ఎందుకంటే “ఆచార్య” టైటిల్ విషయంలో కూడా మేకర్స్ మొన్న అధికారిక ప్రకటన చేయక ముందే ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన టైటిల్ మారలేదు.

మరి ఇదేవిదంగా ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చే సినిమాకు కూడా అప్పుడే “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టుగా తెలిసింది. మరి బహుశా ఒకవేళ చిత్రం స్టార్ట్ చేసినపుడు కూడా మెగాస్టార్ సినిమా లాగే అదే టైటిల్ ను అనౌన్స్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదని చెప్పాలి.