సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా

సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా
సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది

సుకుమార్  శిష్యుడు కార్తిక్ వర్మ తెరకెక్కించిన మొదటి చిత్రం ‘విరూపాక్ష’, SVCCతో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్  జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై హిట్ బాటలో నడుస్తుంది . ఇది సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.  సాయిధరమ్ తేజ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.

ఇదిలా ఉంటే, ‘విరూపాక్ష’ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించిన విషయం అందరికి  తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడంలో తనే కీలక పాత్ర పోషించి, శిష్యుడు కార్తీక్ వర్మను దర్శకుడిగా నిలబెట్టాడు. ప్రస్తుతం సినిమా కూడా హిట్ కావడంతో సుకుమార్ భారీ లాభాలు వస్తున్నాయి.
‘విరూపాక్ష’ చిత్రానికి SVCCతో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇక ఈ స్క్రిప్ట్‌ కోసం తగినంత టైమ్ వెచ్చించిన సుకుమార్.

కీలకమైన ట్విస్ట్‌లు జోడించి కథను ఆసక్తికరంగా రాసాడు . నిజానికి ఆయన ఈ చిత్రానికి ఇన్వెస్ట్ చేయనప్పటికీ.. స్క్రిప్ట్‌ వర్క్‌లో తన సహకారానికి గాను లాభాలను పంచుకున్నట్లు  టాలీవుడ్  సమాచారం.
ఇక ‘విరూపాక్ష’ చిత్రంలో మలయాళ భామ సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్‌గా నటించింది. సోనియా సింగ్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అజినీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో క్రూషియల్ రోల్ ప్లే చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతుండగా.  AskSDT పేరుతో ఫ్యాన్స్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో సాయిధరమ్ కూడా కన్‌ఫర్మ్ చేసేశాడు.

సినిమా విజయంతో విరూపాక్ష టీమ్ చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని సంపత్ నంది డైరెక్షన్‌లో ఉంటుంది . ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో PKSDT చిత్రంలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చగా, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.