సింహాద్రి రీ రీలీజ్- వెయిటింగ్ ఫర్ మాస్ జాతర అంటూ విశ్వక్ సేన్ ట్వీట్

సింహాద్రి రీ రీలీజ్- వెయిటింగ్ ఫర్ మాస్ జాతర
సింహాద్రి రీ రీలీజ్- విశ్వక్ సేన్ ట్వీట్

S S రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా “సింహాద్రి”. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా 4 కె క్వాలిటీ తో రీ-రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది.

గత కలం లో సూపర్ హిట్ అయిన పాపులర్ హీరో ల సినిమాలను ఇప్పుడు మళ్ళి విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ పుట్టినరోజు ల సందర్బంగా వీరి కొన్ని హిట్ సినిమాలు రి రిలీజ్ చేసారు.

కొద్ది రోజుల క్రితం హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన హిట్ సినిమా అయినా ఆరెంజ్ ని రీరిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా మంచి కలెక్షన్ సంపాదించింది. అయితే ఈ సినిమా కి వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీ కి విరాళంగా ఇస్తున్నట్టు నిర్మాత నాగబాబు తెలిపారు.

ఇక రీసెంట్ గ హీరో అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్బంగా “దేశముదురు” సినిమా రీ రిలీజ్ చేసారు. ఇక ఇప్పుడు వచ్చింది యంగ్ టైగర్ వంతు.

ఎన్టీఆర్ సినిమాల్లో వన్ అఫ్ ది బెస్ట్ గ నిలిచినా చిత్రం “సింహాద్రి”. మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా 4కే క్వాలిటీ తో అభిమానుల ముందుకి రానుంది.

ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరైన, ఇటీవలి “దాస్ కా ధమ్కీ” తో హిట్ ఇచ్చిన హీరో విశ్వక్ సేన్ సైతం ఈ సినిమా రీ రిలీజ్ పై ఉత్సాహం వక్తం చేసారు. అయితే తన సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లి యంగ్ హీరో కి బెస్ట్ విషెస్ తెలియజేసారు అయితే ఇప్పుడు తన వంతుగా తన అభిమాన హీరో సినిమా సింహాద్రి రీ రిలీజ్ కు సపోర్ట్ గ నిలిచారు.

ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ వేదిక గా, “వస్తున్నాడు. సింహాద్రి 4కే రిలీజ్ ఆన్ మాస్ అమ్మ మొగుడు తారక్ అన్న బర్త్డే, వెయిటింగ్ ఫర్ మాస్ జాతర ఎట్ థియేటర్స్,. జై ఎన్టీఆర్” అంటూ రాసుకొచ్చారు.

NTR at Das Ka Damki event
Jr NTR & Vishwak sen

ఈ ట్విట్ కు ఎన్టీఆర్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. సింహాద్రి రీ రిలీజ్ తో రీ రిలీజ్ ల రికార్డులు తిరగరాయాలని అభిమానులు అనుకుంటున్నారు. సింహాద్రి సినిమా, రీ రీలీజ్ ల హిస్టరీ బ్రేక్ చేయనుందా, అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు వరకు వేచి చూడాల్సిందే.