సిక్స్ ప్యాక్ కోసం నిఖిల్ యుద్ధం..

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నిఖిల్ సీక్వెల్ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాడు. అయితే 2014లో తనకు ఎంతో పేరు.. హైప్ ను తెచ్చి పెట్టిన చిత్రం కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 చిత్రీకరణలో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం మూవీ మేకర్స్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అది అందరి ప్రేక్షకుల చూపును ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా కోవిడ్-19.. కరోనా వైరస్ కారణంగా.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షూటింగ్స్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే.

సిక్స్ ప్యాక్ కోసం నిఖిల్ యుద్ధం.. - Telugu Bullet

ఇదే సమయంలో నిఖిల్… ఖాళీగా ఉండకుండా మన హీరో చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తన సినిమాకు మంచి లుక్ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తన్నాడంట. అతని ప్రయత్నం.. ఎంతవరకు బాగుంటుందో చూడాలి. అయితే కార్తికేయ 2తో పాటు.. ఈ మధ్య లాంచ్ అయిన ’18 పేజీల’ నినిమాలో కూడా నటించనున్నాడు. కాగా నిఖిల్ సిద్ధార్థ్ నటించే 18 పేజీల సినిమా గీతా ఆర్ట్స్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.