10 రోజల ‘ఆదిపురుష్’ కలెక్షన్లు..

10 రోజల 'ఆదిపురుష్' కలెక్షన్లు..
Adipurush

రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది అని తెలుస్తుంది . విమర్శల మధ్యే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో వారాంతం కలెక్షన్లు తగ్గినప్పటికీ నిన్న ఒకరోజు రూ. 6 కోట్ల వసూళ్లను సాధించింది అని సమాచారం.

విడుదల రోజు నుండి నుంచి ఇప్పటి వరకు 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్ల గ్రాస్ ను సాధించింది అని విశ్లేషణ. ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందా? లేదా? అనేది ఈ వారంలో తేలిపోనుంది.

తాజగా సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ‘ఆదిపురుష్’ చిత్ర బృందం మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. 3డీ టికెట్ ప్రారంభ ధరను రూ. 112కి తగ్గించారు. ఈరోజు నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇప్పటికే టికెట్ ధరను రెండు సార్లు తగ్గించిన సంగతి అందరికి తెలిసిందే..