35 ఏళ్లు దాటినా పెళ్లి మాటెత్తని హీరోయిన్స్…

35 ఏళ్లు దాటినా హీరోయిన్స్
35 ఏళ్లు దాటినా హీరోయిన్స్

పెళ్లి వయసు వచ్చినా వివాహం గురించి ఆలోచించని హీరో హీరోయిన్స్ ఇప్పుడు చాలా మందే వున్నారు. 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్ళి చేసుకుని హీరోయిన్లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం ,నాలుగు పదులు దాటినా పెళ్ళి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది .త్రిష కృష్ణన్ 39 ఏళ్లు వచ్చినా అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. శృతి హాసన్ వయస్సు కూడా 37 ఏళ్ళు దాటిపోయింది. కానీ… ఇంకా మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్ట లేదు.

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీ రంగంలో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా రాణిస్తోంది. అయితే 35 ఏళ్లు దాటినా ఇంతవరకూ అమ్మడు పెళ్ళి చేసుకోలేదు.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ వుమెన్ సెంట్రిక్ చిత్రాలతో దూసుకుపోతోంది. క్వీన్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

దేవదాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న గోవా బ్యూటీ ఇలియానా. ప్రెజెంట్ ఏజ్ 36.ఇంకా పెళ్లి చేసుకోలేదు .శ్రద్దా కపూర్: వయస్సు 36 ఏళ్లు ,సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వయసు ఇప్పుడు 37 ఏళ్ళు .ఇకపోతే టబు (52), సుస్మితా సేన్ (47), కృతి సనన్ (32), పూజా హెగ్డే (32) అమీషా పటేల్ (47) వంటి ఏజ్ బార్ నటీమణులు కూడా ఇంకా వివాహ బంధంలో అడుగుపెట్టలేదు. తమన్నా భాటియా (33), ప్రగ్యా జైస్వాల్ (33) వంటి పలువురు హీరోయిన్లు ముప్పై క్రాస్ చేసి పెళ్ళి చేసుకోని హీరోయిన్ల జాబితాలో ఉన్నారు