Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ పోస్టర్!

‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. రూ.75 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ పోస్టర్!
‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. రూ.75 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ పోస్టర్!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ Aadarsha Kutumbam బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని మేకర్స్ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూళ్లు!

తాజాగా సినిమా మొదటి వారాంతపు కలెక్షన్లను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వారి వివరాల ప్రకారం, ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్’ ట్యాగ్‌తో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోనూ అదిరిపోయే వసూళ్లు!

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే 850K డాలర్ల వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారీ తారాగణంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

మిక్స్‌డ్ రివ్యూల మధ్య కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ ప్రయాణంపై ఆసక్తి పెరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ పోస్టర్! - Telugu Bullet