సురేంద‌ర్ రెడ్డితో సునీతారెడ్డికి రెండో వివాహం

Suneetha reddy second marriage with Surender Reddy
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సీఐ మ‌ల్లికార్జున్ రెడ్డితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని అడ్డంగా బుక్క‌యిన ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి కేసులో మ‌రో విష‌యం వెలుగుచూసింది. సునీతారెడ్డికి సురేంద‌ర్ రెడ్డి రెండో భ‌ర్త‌. అంత‌కుముందు ఆమె ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్ సోద‌రుడు లెనిన్ ను తొలివివాహం చేసుకుంది. రెండేళ్ల కాపురం త‌ర్వాత అత‌ని నుంచి విడిపోయింది. మొద‌టి భ‌ర్త‌పై సునీతారెడ్డి వ‌ర‌క‌ట్నం కేసు కూడా పెట్టింది. కొన్నాళ్ల‌కు సునీతారెడ్డి సురేందర్ రెడ్డిని పెళ్లిచేసుకుంది. సునీత మొద‌టి పెళ్లి ఫొటోలు చూసి సురేంద‌ర్ రెడ్డి షాక‌య్యాడు.

సునీతారెడ్డి, మ‌ల్లికార్జున్ రెడ్డి వివాహేత‌ర సంబంధానికి సంబంధించిన కేసులో ఈ పెళ్లిఫొటోలు కీల‌కంగా మారాయి. ఈ కేసు ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉంది. గ‌త నెల‌లో సీఐ మల్లికార్జున్ రెడ్డి సురేంద‌ర్ రెడ్డి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ సురేంద‌ర్ రెడ్డికి చిక్కాడు. అనంత‌రం సునీతారెడ్డి అమ్మ‌, పెద్ద‌మ్మ మ‌ల్లికార్జున్ రెడ్డిని కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. భార్య వ్య‌వ‌హారంపై సురేంద‌ర్ రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదుచేశాడు. దీంతో ఉన్న‌తాధికారులు సునీతారెడ్డి, మ‌ల్లికార్జున్ రెడ్డిల‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.