నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ : నటి శోభన

సెలబ్రిటీలకు చెందిన సోష‌ల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కావడం చాలా కామన్ అయిపోయింది. ఇదివరకు చాలా అలా హ్యాక్ కు గురయ్యాయి. అయితే తాజాగా ప్ర‌ముఖ న‌టి శోభ‌న ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింద‌ట‌. ఈ విష‌యాన్ని శోభ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం పోలీసులు, సైబర్ క్రైమ్ దీనిపై విచార‌ణ చేస్తున్నారు.

‘నా ఫేస్ బుక్ అకౌంట్ మ‌ళ్లీ అందుబాటులోకి రాగానే మీకు తెలియ‌జేస్తాను’ అని తెలిపింది శోభ‌న. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న న‌టి శోభ‌న. సినిమాల్లో మంచి క్రేజ్ వున్న ద‌శలోనే ఆమె న‌ట‌న‌కు గుడ్ బై చెప్పారు. తెలుగులో పూర్తిగా అసలు న‌టించ‌డ‌మే మానేశారు. అప్పుడ‌ప్పుడు మ‌ల‌యాళ సినిమాల్లో అలా మెరుపుతీగ వలె మెరిసిపోతూ మాయమై పోతున్నారు. ఈ మధ్య దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించి నిర్మించిన `వారానే అవ‌శ్య‌ముడ్‌` చిత్రంలో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్నా.. కూడా త‌న‌కు ఇష్ట‌మైన క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో దేశ విదేశాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటోంది శోభన.