ఆదిపురుష్: ఆంజనేయుడి పక్క సీట్ల టికెట్ ధర ఇంతనా… నిజామా ??

ఆదిపురుష్: ఆంజనేయుడి పక్క సీట్ల టికెట్ ధర ఇంతనా... నిజామా ??
ఆదిపురుష్

ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రోల్స్, విమర్శలు షురూ అయ్యాయి.ఈ క్రమంలోనే తాజాగా టికెట్ల ధరల విషయంలో సోషల్ మీడియా లో అనేక రకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను తాజాగా చిత్ర బృందం ఖండించింది.

రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికి హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయించారు. అయితే ఆ సీటు పక్కనున్న సీట్ల టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలో ఎలాంటి నిజాలు లేవని స్పష్టం చేసింది చిత్ర బృందం….హనుమంతుడి సీటుతోపాటు పక్క సీట్ల టికెట్ ధరలో ఎలాంటి తేడా ఉండదని తెలియజేసింది.

సోషల్ మీడియా లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రేక్షకులు నమ్మరాదని కోరింది . కాగా ఈ సినిమా ఏ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా పలువురు సినీ ప్రముఖులు నిరుపేద విద్యార్థులు, అనాథల కోసం వేలల్లో టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

ఆదిపురుష్: ఆంజనేయుడి పక్క సీట్ల టికెట్ ధర ఇంతనా... నిజామా ??
ఆదిపురుష్ హనుమాన్