అక్షయ్‌కుమార్ రిస్కీ స్టంట్స్..

akshay kumar risky stunts

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఐదు పదుల వయస్సులోనూ రిస్కీ స్టంట్స్ చేసి అదరహో అనిపిస్తున్నాడు. అక్షయ్‌కుమార్-రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో సూర్యవంశీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం హై ఓల్టేజీ యాక్షన్ సీన్లలో ఎలాంటి డూప్ లేకుండా నటించాడు అక్షయ్. అక్షయ్‌ బైకుపై స్టంట్ చేస్తూ..పైన వెళ్తున్న హెలికాప్టర్‌పై ఎక్కి తలకిందులుగా వేలాడుతూ చేసిన ఫీట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మొదటి నుంచి నటనే నా విధి. యాక్షన్ నా లైఫ్ లైన్. సూర్యవంశిలో స్వచ్ఛమైన యాక్షన్ మీకు దొరుకుతుందని క్యాప్షన్ ఇచ్చాడు అక్షయ్. రోహిత్‌శెట్టి యాక్షన్ సన్నివేశాల్లో ది బెస్ట్ సీన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.