నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న ఆలియా భట్

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న ఆలియా భట్

బాలీవుడ్ నటి ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించనుంది. రెండ్రోజుల క్రితమే ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్‌ టీమ్‌తో జతకలిసింది. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను సుమారు రూ.450కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

అసలే భారీ బడ్జెట్ మూవీ కావడంతో టెన్షన్లో ఉన్న నిర్మాతకు ఆలియా వ్యవహారం మరింత తలనొప్పిగా మారిందట. పది మంది వ్యక్తిగత సిబ్బందితో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆలియాకు అన్ని సౌకర్యాలు నిర్మాతే సమకూర్చాల్సి ఉంది. ఆలియాతో పాటు న‌లుగురు బౌన్సర్లు, ఓ మేక‌ప్ ఆర్టిస్ట్‌, పీఏ, హెయిర్ స్టైలిష్ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్, మేనేజ‌ర్‌, పర్సనల్ డ్రైవ‌ర్‌‌కు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. వీరందరికీ కలిసి రోజుకి సుమారు రూ.లక్షకి పైగా ఖర్చు అవుతోంది. దీంతో ఆమెకిచ్చే భారీ రెమ్యునరేషన్‌కి తోడు ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆవేదన చెందుతున్నారట.