నిర్మాతగా మారిన అల్లరి నరేష్

నిర్మాతగా మారిన అల్లరి నరేష్

ఈవీవీ సినిమా ప‌తాకంపై ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ప‌లు చిత్రాల్ని అందించారు. అందులో ఆమె లాంటి సూప‌ర్ హిట్లున్నాయి. ఆయ‌న త‌ద‌నంత‌రం న‌రేష్ ఈవీవీ ప‌తాకంపై `బందిపోటు` రూపొందించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత క‌థానాయ‌కుడిగా న‌రేష్ కెరీర్ అమాంతం డౌన్‌ఫాల్ లో ప‌డిపోయింది. న‌రేష్‌కి ఇప్పుడు అవ‌కాశాలు రావ‌డ‌మే గ‌గ‌నం అయ్యింది. అయితే ఈవీవీ ప‌తాకంపై ఇప్పుడు ఆయ‌న మ‌రో సినిమాని రూపొందించ‌డంలో బిజీ అయ్యార‌ని తెలుస్తోంది. అస‌లు విశేషం ఏమిటంటే… ఈ స్క్రిప్టు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ రాసుకున్న‌దే. గ‌తంలో ఆయ‌న న‌రేష్‌తో చేద్దామ‌నుకున్న ఓ క‌థ‌ని ఇప్పుడు సినిమాగా తీయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కీ, న‌రేష్‌కీ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని స‌మాచారం. ఇది ఈవీవీ గ‌త హిట్ చిత్రాల‌కు సీక్వెల్ అని స‌మాచారం. మ‌రి.. ఆ క‌థేమిటో, సినిమా ఎప్పుడో.. న‌రేషే చెప్పాలి.