పెద్ద కొడుకు కూడా వచ్చేస్తున్నాడు…!

Allu Aravind Big Son Bobby Entry To The Film Industry

అల్లు అరవింద్ తెలుగు సినిమా పరిశ్రమలో పేరు మోసిన బడా నిర్మాత. గీత అత్ర్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సూపర్ హిట్ట్ చిత్రాలను నిర్మించాడు. కొత్తతరం నిర్మాతలు వస్తున్నా వారికీ పోటిగా సినిమాలు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ కి మొత్తం ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు పేరు బాబీ, రెండోవ కుమారుడు ఆర్జున్ మూడోవ కుమారుడు శిరీష్. రెండోవ కుమారుడు అల్లు ఆర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మూడోవ కుమారుడు అల్లు శిరీష్ కూడా తన అన్న బాటలో పయనిస్తూ హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా పెద్ద కుమారుడు బాబీ ఇన్ని రోజులు వ్యాపారరంగంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన తండ్రి బాటలో నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. అల్లు బాబీ నిర్మాతగ ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

బాబీ రిలేటివ్ అయినా సిద్దుతో కలిసి కార్తీక్ అనే కొత్త కుర్రవాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో స్పోర్ట్స్ అండ్ లవ్ డ్రాప్ లో ఓ సినిమాను నిర్మించేందుకు అల్లు బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ అంతరిక్షం, ఎఫ్2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత అల్లు బాబీ నిర్మాణంలో తన తరువాత సినిమాలో నటిస్తాడు. అల్లు అరవింద్ గారికి సినిమా నిర్మాణంలో మంచి టేస్ట్ ఉన్నది. ఇప్పుడు తన పెద్ద కుమారుడు బాబీ తండ్రి పేరును నిలబెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. మొత్తానికి అల్లు ఫ్యామిలీ మొత్తం సినిమా వైపు నడుస్తుంది.