చిత్తూరు యాసలో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న అల్లు అర్జున్

చిత్తూరు యాసలో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న అల్లు అర్జున్

రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్దం చేశారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ను లారీ డ్రైవర్ గెటప్ లో తీర్చి దిద్దారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ సీరియస్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఫస్ట్ లుక్ తోనే సుకుమార్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అది చూపించారు.

అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పట్టకు తగ్గట్లుగా ఒక ఫోక్ సాంగ్ ఉండే అవకాశం ఉంది. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ఇప్పటికే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రంగస్థలం చిత్రంలో మాస్ బీట్ జిగేల్ రాణీ తో సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ఇరగదీశారు.అయితే అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్లుగా సినిమా ను ప్రెసెంట్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ పూర్తి స్థాయిలో శ్రద్ద పెడుతున్నారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ బిట్స్ అందుకోవడం కూడా కష్టమే అని తెలుస్తోంది. సీరియస్ లుక్ తో అదరగొట్టిన స్టైలిష్ స్టార్, ఈ ఫోక్ సాంగ్ లో మాత్రం ఎలా కనిపిస్తారో అనేది ఇపుడు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.