మళ్లీ ప్రేమ వివాహమే

amala paul gets second marriage

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘నాన్న’ చిత్రం సమయంలో దర్శకుడు విజయ్‌ మరియు హీరోయిన్‌ అమలాపాల్‌ల మద్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి వివాహ బంధం కొన్నాళ్లపాటే సాగింది. ఇద్దరి మద్య విభేదాల కారణంగా రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న వీరిద్దరు ప్రస్తుతం మళ్లీ వారి వారి సినిమాలతో బిజీ అయ్యారు. ఆ మద్య విజయ్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అని తేలిపోయింది. తాజాగా అమలాపాల్‌ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.

ఒక్క పెళ్లి విఫలం అవ్వగానే తానేం సన్యాసినిగా మారను అని, మంచి వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. తన రెండవ పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని, అలాగని పెళ్లిపై ఆసక్తి లేదని కాదని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటాను. ఈమె మాటలు చూస్తుంటే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా అనిపిస్తుందని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగులో ఈమెకు ఒక స్టార్‌ హీరో సరసన అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

 


మళ్లీ ప్రేమ వివాహమే - Telugu Bullet