కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తున్న అమీర్‌ఖాన్‌

కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తున్న అమీర్‌ఖాన్‌

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అమీర్‌ఖాన్‌ ప్రస్తుతం లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అమీర్‌ కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. ఈ సినిమా లొకేషన్ లో నుంచి అప్పుడపుడు బయటకు లీకైన అమీర్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా అమీర్‌ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

అమీర్‌ పొడవాటి వెంట్రుకలు, గడ్డంతో కొంతమంది మహిళలు, చిన్నారులతో కలిసి దిగిన ఫొటో వైరల్‌ అవుతోంది.ఈ చిత్రం షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతుండటంతో.. అమీర్‌ దిగిన ఫొటోలు అక్కడివేనని అర్థమవుతోంది. అమీర్‌ తలకు సంప్రదాయ టోపీ పెట్టుకుని స్థానిక మహిళలతో కలిసి దిగిన ఫొటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు..వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.కరీనాకపూర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.