విజయ్ తమ్ముడి రెండో సినిమా…ఆ బ్యానర్ లోనే !

Vijay Thammudi's second movie ... in the banner!

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్ హీరో హోదా అనుభవిస్తున్నాడు. తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయని దేవరకొండ చివర్లో రిలీజ్ అవుతుందనంగా ప్రమోట్ చేసీ చెయ్యనట్టు ప్రమోట్ చేశాడు.

అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా కధాపరంగా మంచి పేరు వచ్చినా నటుడిగా ఆనంద్ దేవరకొండకి మంచి పేరు తేలేకపోయింది. అయితే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమా రిలీజ్ కాక ముందే ఈయన రెండో సినిమా చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది.

అదేంటంటే ఈయన రెండో సినిమా భవ్య క్రియేషన్స్ లో ఉండనుందట. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 12గా తెరకెక్కనున్న సినిమాలో ఆనంద్ హీరోగా ఎంపికయ్యాడని రచయితగా పలు సినిమాలకి పని చేసిన వినోద్ అనంతోజు అనే ఆయన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని ప్రచారం జరుగుతోంది.

తమ్ముడికి మొదటి సినిమా క్రేజ్ తేలేక పోవడంతో రెండో సినిమా చేయాల్సిందిగా ఆనంద్‌ ప్రసాద్‌ ను విజయ్‌ దేవరకొండ రిక్వెస్ట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది.