ప్రధాన కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌

ప్రధాన కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌

ప్రస్తుత కోచ్ పాడీ ఆప్టన్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కి కొనసాగుతున్నాడు. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ను ప్రధాన కోచ్‌గా నియమించింది. రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ను బాద్యతలు చేపట్టనున్నాడు.

గతంలో మెక్‌డొనాల్డ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లకు కోచ్‌గా బాద్యతలు నిర్వహించాడు. తర్వాత బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యంలో బౌలింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు.

వేరే వేరే దేశాలకి జరిగే టీ20 మ్యాచ్లకి కోచింగ్ ఇచ్చిన జట్లకు టైటిల్ రావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆండ్రూ సేవలు వినియోగించుకొని వచ్చే ఐపీఎల్లో రాణించాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. రాయల్స్ ఫ్యామిలీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది అని ఈ సందర్బంగా 38 ఏండ్ల మెక్‌డొనాల్డ్ తెలిపారు.