‘డబుల్ ఇస్మార్ట్’లో మరొక హీరోయిన్ ?

Another heroine in 'Double Smart'?
Another heroine in 'Double Smart'?

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఇప్పుడు ఈ సాంగ్ ని అనన్య పాండేతో చేయిస్తున్నారని టాక్. పూరి దర్శకత్వంలో వచ్చిన లైగ‌ర్ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా లో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ మూవీ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ మూవీ ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.