ఆ అమ్మాయి విషయంలో మారుతి ఆలోచిస్తే బాగుండేది!

Anu Emmanuel Naga Chaitanya new movie details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుస విజయాలతో దూసుకు పోతున్న మారుతి తాజాగా ‘మహానుభావుడు’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సవ్యసాచి పూర్తి కాకుండానే రేపటి నుండి మారుతి దర్శకత్వంలో సినిమాను షురూ చేయబోతున్నాడు. నాగచైతన్యతో మారుతి చేయబోతున్న ఈ చిత్రానికి ఇప్పటికే ‘శైలజరెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. శైలజ పాత్రకు సీనియర్‌ హీరోయిన్‌ను ఎంపిక చేయబోతున్నారు. పొగరుబోతు అత్తగా ఎవరు నటిస్తే బాగుంటుందా అనే చర్చ జరుగుతుంది. ఇక ఆ పొగరుబోతు అత్తకు అంతే పొగరుబోతు కూతురు కూడా ఉండబోతుంది. ఆ కూతురు పాత్రను అను ఎమాన్యూల్‌ చేయనున్నట్లుగా అధికారిక సమాచారం అందుతుంది.

శైలజరెడ్డి కూతురుగా అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అజ్ఞాతవాసి చిత్రంలో అను పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అంతకు ముందు కూడా అను తన గ్లామర్‌తో నెట్టుకు వచ్చింది కాని, నటనతో ఇప్పటి వరకు మెప్పించిన దాఖలాలు లేవు. మారుతి చిత్రంలో హీరోయిన్స్‌కు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాంటి పాత్రలో అనును తీసుకోవడం అంటే కాస్త సాహస నిర్ణయం అని చెప్పుకోవచ్చు.

పొగరుబోతు అమ్మాయి పాత్రలో అను ఎలా నటిస్తుంది అనేది కాస్త అనుమానమే అని, ఆమె స్థానంలో మరెవ్వరైనా స్టార్‌ హీరోయిన్‌ను పెట్టడం వల్ల సినిమా స్థాయి పెరగడంతో పాటు, పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని కొందరు సలహా ఇస్తున్నారు. కాని మారుతి మాత్రం అనుపై పూర్తి నమ్మకం ఉంచడం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత శైలజ రెడ్డి కూతురుగా అను ఎలా చేసింది అనేది తెలిసే అవకాశం ఉంది.