చిరంజీవికి జోడీగా అనుష్క

చిరంజీవికి జోడీగా అనుష్క

ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆచార్య అనే చిత్రంలో నటించనున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఇకపోతే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో, మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో చిరు కి జోడిగా మొదటగా త్రిష ని తీసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన త్రిష ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం.

ఆ తరువాత త్రిష స్థానంలో కాజల్ ని తీసుకున్నారని కూడా వార్తలు బాగానే వచ్చాయి… కానీ అవి అన్ని కూడా వట్టి పుకార్లే అని కొట్టిపారేస్తూ మరొక హీరోయిన్ పేరు తెరమీదకు వచ్చింది. తానెవరో కాదు… అందాల అనుష్క. కాగా చిరంజీవికి జోడీగా, ఆ పాత్రకి తగ్గట్లుగా అనుష్క అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శక నిర్మాతలు అనుష్క ని ఆ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్రలో నటించడానికి అనుష్క కూడా ఇష్టత చూపుతుందని సమాచారం. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…