అద్భుతమైన వెబ్ సిరీస్ తో రానున్న అనుష్క శర్మ

అద్భుతమైన వెబ్ సిరీస్ తో రానున్న అనుష్క శర్మ

ప్రస్తుత భారత జట్టు క్యాప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అనుష్క శర్మ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. తాను నటించడం లేదు కానీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అలా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లోకి తీసుకొచ్చిన సెన్సేషనల్ వెబ్ సిరీస్ “పాతాళ్ లోక్”. ఈ సిరీస్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే ఇప్పుడు మరో అద్భుతమైన వెబ్ సిరీస్ తో అనుష్క శర్మ రానున్నట్టు తెలుస్తుంది.

ఒక మర్మంతో కూడిన గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటా అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బుల్ బ్బుల్” ఈ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎంత యూనిక్ గా ఉంటుందో చూడాలి.