అవెంజర్స్’ ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్

‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ విడుదల కోసం అవెంజర్స్ ఫ్యాన్స్ అంతాఎంత ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరందరి ఆసక్తి వందింతలు కానుంది. ఎందుకంటే..  ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటన’ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ లో పొందుపరుస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం. మరీ ముఖ్యంగా ఈ పాటను హైదరాబాద్ లో ఏప్రిల్ 7 లేదా 8 తారీఖుల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఏ.ఆర్.రెహమాన్స్వయంగా ఆవిష్కరించనున్నారు. ది వాల్ట్ డిస్ని కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు!!