అరవింద సమేత ఆడియో వేడుక గెస్ట్‌లపై పుకార్లే పుకార్లు

Aravinda sametha Movie Audio Launch Chief Guest in Amitabh Bachan

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్దం అవుతుంది. సినిమా షూటింగ్‌ టాకీ పార్ట్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. టాకీ పూర్తి అవ్వడంతో పాటల చిత్రీకరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈనెల 20న ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో మొన్నటి వరకు బాలయ్య హాజరు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మహేష్‌బాబు ప్రత్యేక అతిథిగా అరవింద సమేత చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరుగనున్నట్లుగా పుకార్లు వచ్చాయి.

amitabh bachchan in Aravinda sametha Movie Audio Launch

మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్‌తో మహేష్‌బాబుకు మంచి స్నేహం ఉంది. ఈ రెండు కారణాల వల్ల అరవింద సమేత చిత్రంకు నిజంగానే మహేష్‌బాబు ముఖ్య అతిథిగా వస్తున్నాడేమో అని అనుకున్నారు. ఇక తాజాగా ఈ ఆడియో వేడుకలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కూడా పాల్గొంటాడు అంటూ పుకార్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ అమితాచ్చన్‌ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, అందుకే ఆడియో వేడుకలో గెస్ట్‌గా వచ్చేందుకు అమితాబ్‌ సిద్దం అయ్యాడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి అరవింద సమేత చిత్రం ఆడియో విడుదలకు సంబంధించిన గెస్ట్‌ ల గురించి పుకార్ల మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి.