బిడ్డ ఫర్ సేల్: అమ్మకానికి కడుపులో బిడ్డ.. సంచలనంగా ఫేస్ బుక్ పోస్ట్…

ఫేస్‌బుక్‌ లో ఈ కొత్త ఫీచర్‌ను చూశారా?

మహారాష్ట్రలో అమ్మతనం చిన్నబోయింది. అమ్మతనానికి మచ్చతెచ్చేలా ఘోరమైన ఘటన వెలుగు చూసింది. కడుపులో బిడ్డ భూమ్మీద పడకముందే అమ్మకానికి పెట్టేసింది ఓ తల్లి. తన బావతో కలసి బిడ్డను బేరం పెట్టింది. అతను బిడ్డను అమ్ముతామంటూ ఫేస్‌బుక్‌లో బేరసారాలు నడిపి అడ్డంగా బుక్కయ్యాడు. కడుపులో బిడ్డను విక్రయించేందుకు యత్నించిన అమానుష ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది.

అదేమంటే… కడుపులో బిడ్డను అమ్మేందుకు యత్నించిన కేసులో షెన్‌పుంజి ప్రాంతంలోని రంజన్‌గావ్‌కి చెందిన శివశంకర్ తగాడెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే శివశంకర్ మరదలు ఏడు నెలల గర్భిణి. కొద్దికాలం కిందట ఆమె భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమె అప్పటికే గర్భవతి. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల. ఆమె మరో పెళ్లి చేసుకొనేందుకు గర్భం అడ్డంకిగా మారింది. కాగా అబార్షన్ చేయించుకొనే స్టేజ్ దాటిపోవడంతో కడుపులో బిడ్డను అమ్మేసి.. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవచ్చని ఆలోచించింది. ఆమె బావ సాయంతో బిడ్డను అమ్మేందుకు రెడీ అయింది.

బిడ్డ కావాల్సిన వారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ లో శివశంకర్ పోస్టు పెట్టాడు. అది చూసి శిశుసంక్షేమ అధికారులు పోలీసులకు తెలపడంతో గుట్టు రట్టయింది. కాగా ప్రసవం అయిన వెంటనే బిడ్డను కొనుక్కున్న వారికి ఇచ్చేసి ఆమె మరో పెళ్లి చేసుకోవాలనుకుంది. దీంతో ఆమె బావ ఫేస్‌బుక్‌లో సంప్రదింపులు జరిపి అడ్డంగా బుక్కయ్యాడు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సమాచారం మేరకు శివశంకర్‌పై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.