ఆ టైటిల్ నే నమ్ముకున్న బాలయ్య

Bala Krishna fixed for his next movie title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలకృష్ణ 102 వ సినిమా కి టైటిల్ ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ఇంతకుముందు అనుకున్న పేర్లు మొత్తం పక్కన పెట్టారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఆలోచించిన రెడ్డి గారు, కర్ణ, జయసింహ పేర్లు మొత్తం వెనక్కి పోయాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ని జై సింహా అని ఫిక్స్ చేశారు. సింహా అనే టైటిల్ పేరులో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని బాలయ్య కెరీర్ లో ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. అందుకే అదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు ఇంకోసారి.

ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు అరకులో మొదలు అయ్యింది. ఇంతకుముందే మూసాపేటలో సినిమా క్లయిమాక్స్ పూర్తి అయ్యింది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా నిజానికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే అంతకన్నా నెల ముందే సినిమా విడుదలకి సిద్ధం అయిపోతుంది. కొన్నేళ్లుగా డిసెంబర్ లో కూడా నాగ్ సినిమాలు విడుదల చేసి హిట్ కొడుతున్నారు. ఈసారి బాలయ్య కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతాడేమో.