జైసింహా ఆ రకంగా కూడా పెద్ద సినిమా.

Balakrishna Jai Simha Movie runtime

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈ సంక్రాంతికి వస్తున్నవి రెండు పెద్ద సినిమాలు. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి అయితే ఇంకోటి నట సింహం బాలయ్య నటించిన జైసింహా. ఈ రెండు సినిమాల్లో కూడా అజ్ఞాతవాసి కి ఉన్నంత క్రేజ్ జైసింహా కి లేని మాట నిజం. అయితే సంక్రాంతికి బాలయ్య హిస్టరీ చూస్తే మాత్రం పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన దాఖలాలున్నాయి. అందుకే రిలీజ్ కి ముందు బజ్ విషయంలో వెనుకబడినా జైసింహా ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.

అయితే ఇంకో విషయంలో మాత్రం అజ్ఞాతవాసి కన్నా జైసింహా పెద్ద సినిమా. ఎందులో అనేగా మీ డౌట్ ? సినిమా నిడివి విషయంలో. ఈ మధ్య సినిమాలన్నీ రెండు గంటల నుంచి రెండు పావు గంటలోపే ఉంటాయి. కానీ జైసింహా నిడివి రెండు గంటల నలభై మూడు నిమిషాలు. ఆ విధంగా చూస్తే జైసింహా పెద్ద సినిమా కదా!