బాలయ్య అంత పని చేశాడా ?

Balakrishna to do in SV krishna Reddy Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పైసా వసూల్ అనుకున్న ఫలితం రాకపోవడంతో ముందు అనుకున్నట్టు పూరితో మరో సినిమాకి బాలయ్య వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటికి తెలిసి బాలయ్య ఫాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకో షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో హల్ చెల్ చేస్తోంది. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమా చేస్తున్న బాలయ్య 103 గురించి కూడా ప్లాన్ చేసేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ దర్శకత్వంలో చేద్దామని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ సినిమా మీద వుండే అంచనాలు, వివాదాలు, రామ్ గోపాల్ వర్మ పోటీ సినిమా… ఇలాంటి విషయాలు బాలయ్యని తుది నిర్ణయం తీసుకోకుండా ఆపుతున్నాయట.

బాలయ్య కొత్త సినిమా మీద ఈ సందిగ్ధ అవస్థలో ఉండగానే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఓ కథతో ఆయన్ని కలిశాడట. కృష్ణారెడ్డి చెప్పిన పాయింట్ నచ్చిన బాలయ్య అందుకు ఓకే అన్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడో ఫామ్ కోల్పోయి సినిమా అవకాశాలు రాక వేచి చూస్తున్న కృష్ణారెడ్డితో సినిమా అనగానే బాలయ్య ఫాన్స్ ఈయన ఇంత పని చేశాడా అని బాధపెడుతున్నారట. అసలు కృష్ణారెడ్డి ఫామ్ లో ఉండగానే బాలయ్యతో టాప్ హీరో వంటి ప్లాప్ ఇచ్చాడని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇందులో నిజముందో లేదో బాలయ్య క్లారిటీ ఇచ్చే దాకా ఆయన ఫాన్స్ కి కృష్ణారెడ్డి టెన్షన్ తప్పేట్టు లేదు.