ఫ‌స్ట్ లుక్ లో చైత‌న్య‌ర‌థంపై ఎన్టీఆర్

Balakrishna's-Ntr-Biopic-Fi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న బ‌యోపిక్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. చైత‌న్య ర‌థంపై ఊరూవాడా తిరిగి తెలుగు రాజ‌కీయాల్లో కొత్త శ‌కానికి నాంది ప‌లికిన ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ లో క‌నిపించారు. చైత‌న్య‌ర‌థంపై ఎన్టీఆర్ మైక్ ప‌ట్టుకుని నిల‌బ‌డ‌గా..ఆయ‌న్ను చూస్తూ అశేష‌జ‌న‌వాహిని ఆనందంతో చేతులు ఊపుతున్న‌ట్టు బ్లాక్ అండ్ వైట్ పోస్ట‌ర్ లో క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లే దేవుళ్లు, స‌మాజ‌మే దేవాల‌యంగా జీవించిన ఓ మ‌హానుభావునికి ఇదే మా నివాళి అని పోస్ట‌ర్ పై రాసుంది. ఈ బ‌యోపిక్ కు ఎన్టీఆర్ టైటిల్ ఖ‌రారు చేశారు.

ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణ న‌టిస్తున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ ను సాయి కొర్ర‌పాటి, ఇందూరి విష్ణువ‌ర్ధ‌న్, బాల‌కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో ఇత‌ర న‌టీన‌టులు ఎవ‌ర‌న్న విష‌యాన్ని త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు. ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేసుకోవాల‌న్న విష‌యంలో ఫేస్ రిక‌గ్నిష‌న్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకోవాల‌ని తేజ నిర్ణ‌యించుకున్నారు.

Image result for ntr biopic firstlook