మోక్షజ్ఞ మూవీకి ఏర్పాట్లు

Balayya Hands over Mokshagna To Sai Korrapati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ మీడియాకు కనిపించకుండా దూరంగా ఉంటున్నాడు. కుటుంబంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఆయన బయటకు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆయన లుక్‌ ఎలా ఉందనే విషయంపై ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. ఆయన రీసెంట్‌ ఫొటోగ్రాఫ్స్‌ కూడా ఏమీ లేవు. దాంతో మోక్షజ్ఞ గురించిన ఆసక్తి మరింతగా పెరుగుతుంది. దాదాపు మూడు సంవత్సరాలుగా కనిపించని మోక్షజ్ఞ ఎలా అయ్యాడో అంటూ అంతా కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ గురించిన విషయాలు బాలకృష్ణ కూడా బయటకు చెప్పడం లేదు. గత సంవత్సరంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. కాని వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని సమాచారం అందుతుంది. సాయి కొర్రపాటి నిర్మాణంలో మోక్షజ్ఞ సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు పలు కథలు విన్న సాయి కొర్రపాటి కొన్ని మంచి కథలను ఎంపిక చేశాడు. వాటిల్లోంచి బాలకృష్ణ ఒక కథను ఎంపిక చేసి దాంతో మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మోక్షజ్ఞను ఏదర్శకుడి చేతిలో పెట్టాలి అనే విషయంలో కూడా బాలయ్య ఆలోచనలో ఉన్నాడు. మరో మూడు నెలల్లో ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోక్షజ్ఞను ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో నటింపజేయాలని క్రిష్‌ కోరుకుంటున్నాడు. కాని బాలయ్య మాత్రం అందుకు సున్నితంగా నో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణను క్రిష్‌ ఎలాగైనా ఒప్పిస్తాడనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్‌ ఉన్నారు. ‘ఎన్టీఆర్‌’ చిత్రంతో మోక్షజ్ఞ పరిచయం అయితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.