సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారిన‌ భావ‌న పెళ్లిఫొటోలు

Bhavana Marriage Photos Viral on Internet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దక్షిణాది హీరోయిన్ భావ‌న వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ప్రియుడు, సినీ నిర్మాత న‌వీన్ ను ఆమె కేర‌ళ సంప్ర‌దాయం ప్ర‌కారం, కుటుంబ స‌భ్యులు, అతికొద్దిమంది శ్రేయోభిలాషుల మధ్య వివాహం చేసుకున్నారు. భావ‌న పెళ్లి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బంగారు వ‌ర్ణం చీర‌లో పెళ్లికూతురిగా భ‌ర్త చేయిప‌ట్టుకుని న‌డుస్తున్న భావ‌న ఫొటోను అనేక‌మంది అభిమానులు షేర్ చేస్తున్నారు.

2012లో న‌వీన్ నిర్మించిన ఖ‌రోమియో చిత్రం భావ‌న హీరోయిన్. ఆ సినిమా నుంచే వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. గ‌త ఏడాది మార్చిలో వారి నిశ్చితార్థం జ‌రిగింది. భావ‌న ద‌క్షిణాది భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో న‌టిచంఆరు. ఒంట‌రి, హీరో, మ‌హాత్మ‌, నిప్పు చిత్రాల‌తో తెలుగులో గుర్తింపు పొందారు. క‌న్న‌డ‌లో దాదాపు అగ్ర‌హీరోల అంద‌రి స‌ర‌స‌నా న‌టించారు. పెళ్లి వేడుక త‌ర్వాత మీడియాతో మాట్లాడిన భావ‌న న‌వీన్ త‌మ‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.